ఐపీఎల్ ట్రోఫీని రెండవసారి కైవసం చేసుకున్న ఆర్సీబీ జట్టు విజయాన్ని పురస్కరించుకుని కర్నూలులో అభిమానులు ఆనందోత్సాహాలతో వీరంగం సృష్టించారు. రాజ్ విహార్ సెంటర్ వద్ద సంబరాలు శృతిమించడంతో ప్రైవేటు బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటనతో ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.