RCB విజయం.. బెంగళూరులో సంబరాలు (వీడియో)

3చూసినవారు
RCB సంచలన విజయం సాధించడంతో బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉర్రూతలూగింది. మ్యాచ్ ముగిసిన వెంటనే వందలాది మంది అభిమానులు తమ బైక్‌లపై రోడ్లపైకి దూసుకొచ్చి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. నడిరోడ్డుపైనే బాణాసంచా (క్రాకర్స్) కాలుస్తూ, రంగులు చల్లుకుంటూ తీవ్ర హంగామా సృష్టించారు. ఆర్సీబీ నినాదాలతో సిటీ వీధులన్నీ దద్దరిల్లిపోయాయి. అభిమానులు బైక్‌లను రోడ్డుకు అడ్డంగా నిలిపివేసి రచ్చ చేయడంతో, అర్ధరాత్రి వేళ నగరంలోని ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్