రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లలో ఇరు జట్లు సమంగా నిలిచాయి. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో.. బెంగళూరు నాలుగు, గుజరాత్ నాలుగు విజయాలు సాధించాయి. ఈ సీజన్‌లో రెండుసార్లు తలపడగా, చెరో జట్టు ఒక విజయం సాధించింది. గత మ్యాచ్‌లో గుజరాత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందగా, అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.