ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య మంగళవారం మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కగిసో రబాడా వేసిన బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి అదరగొట్టాడు. ఇప్పటివరకు ఈ మ్యాచ్2లో విరాట్ 34, దేవ్‌దత్ పడిక్కల్ 23 పరుగులు చేశారు. వీరిద్దరూ 23 బంతుల్లో అర్ధశతక భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 76/1గా ఉంది.