అరెస్టు కారణాలు రాతపూర్వకంగా ఇవ్వాలి: సుప్రీంకోర్టు

3చూసినవారు
అరెస్టు కారణాలు రాతపూర్వకంగా ఇవ్వాలి: సుప్రీంకోర్టు
ఒక వ్యక్తిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో పోలీసులు తప్పనిసరిగా రాతపూర్వకంగా తెలియజేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం ప్రతి వ్యక్తికి గల హక్కు అని, వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కులో భాగమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. కారణాలు తెలియజేయడంలో విఫలమైతే అరెస్టు, రిమాండ్‌కు చట్టబద్ధత ఉండదని, అలాంటి వారిని విడుదల చేయాల్సి ఉంటుందని తెలిపారు. అసాధారణ పరిస్థితుల్లో మౌఖికంగా చెప్పినా, రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు కనీసం 2 గంటల ముందు రాతపూర్వకంగా అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్