రీఛార్జ్‌ ప్లాన్లు స్పష్టంగా చూపాల్సిందే: ట్రాయ్‌ ఆదేశం

81చూసినవారు
రీఛార్జ్‌ ప్లాన్లు స్పష్టంగా చూపాల్సిందే: ట్రాయ్‌ ఆదేశం
టెలికాం సేవల్లో పారదర్శకత పెంచేందుకు టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కంపెనీల వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లలో రీఛార్జ్‌ ప్లాన్లు, స్పెషల్‌ టారిఫ్‌ వోచర్లను స్పష్టంగా ప్రదర్శించాలి. ‘TRAI-Mandated Packs’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి.. తప్పనిసరి రీఛార్జ్‌ ప్లాన్లను అందులో చూపాలని తెలిపింది. ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ విభాగాన్ని మొదటి ట్యాబ్‌లో ఉంచాలని, ఆఫ్‌లైన్‌ విక్రయ కేంద్రాల్లోనూ ప్లాన్లను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ నిబంధనలను 30 రోజుల్లో అమలు చేయాలని స్పష్టం చేసింది. అలాగే 30 రోజుల వ్యాలిడిటీతో కాంబో, స్పెషల్‌ టారిఫ్‌, ప్లాన్‌ వోచర్లను అందుబాటులోకి తేవాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్