TG: హైదరాబాద్లోని కీర్తి రిచ్మండ్ గేటెడ్ కమ్యూనిటీలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన గణేశ్ లడ్డూ వేలంలో రూ.1.01 కోట్లు పలికింది. శక్తిమాన్ బృందం ఈ లడ్డూను కైవసం చేసుకుంది. గత ఏడాది రూ.2.31 కోట్లు పలికిన రికార్డుతో పోలిస్తే ఈసారి ధర తక్కువే అయినా, కోటి రూపాయల మార్కును దాటడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.