ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Aug 29, 2026, 10:08 IST/

ఖండాంత‌ర బాలిస్టిక్ క్షిప‌ణి ప‌రీక్షించిన ర‌ష్యా (video)

Aug 29, 2026, 10:08 IST
ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, రష్యా తన అత్యాధునిక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM)ని ఆగస్టు 29, 2026న విజయవంతంగా పరీక్షించింది. ఆర్కంగెల్స్క్ ప్రాంతంలోని పెసెస్కీ కాస్మోడ్రోమ్ నుండి వార్‌హెడ్‌ను పరీక్షించారు. ఈ క్షిపణి ఈశాన్య దిశగా ప్రయాణించి, కమచట్కా ద్వీపకల్పంలోని కురా ట్రైనింగ్ రేంజ్ మీదుగా వెళ్లి అనుకున్న లక్ష్యాలను అందుకున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలో మిస్సైల్ పనితీరు, ఫ్లైట్ పారామీటర్లను పరిశీలించారు. ఇది మొబైల్ లాంచ్ సాలిడ్ ఫ్యూయల్ సిస్టమ్‌గా పేర్కొన్నారు.