AP: గత ఏడాది తిరుమలలో లడ్డూ ప్రసాదాల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2024లో 12.15 కోట్ల లడ్డూలు అమ్మగా, 2025లో ఈ సంఖ్య 13.52 కోట్లకు చేరిందని టీటీడీ తెలిపింది. ఇది గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని అమ్మకాలు. ముఖ్యంగా, డిసెంబర్ 27న ఒక్కరోజే 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. ఇది భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి, స్వామివారిపై వారికున్న భక్తికి నిదర్శనం.