
ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
ఆధునిక టెక్నాలజీని భారతీయులు వినియోగించుకుంటున్న తీరుపై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేరళలో క్యాబ్ బుక్ చేసుకున్నంత సులభంగా కొబ్బరి కాయలు తీసే వ్యక్తిని పిలిపించుకోవచ్చని, శిక్షణ పొందిన వృత్తి నిపుణుడు యూనిఫాం, పరికరాలతో సైకిల్‌పై వచ్చి పని పూర్తి చేసుకుంటాడని తెలిపారు. ఈ యువకుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవాడని, తన కెరీర్ ప్రారంభంలో స్టీల్ బిజినెస్‌లో పనిచేసినప్పుడు బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని గుర్తుచేసుకున్నారు.




