AP: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది.