తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

94చూసినవారు
తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. అలాగే ఈ నవంబర్ 1న కూడా గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు జరిగాయి. హైదరాబాద్‌లో 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర స్థిరంగా ఉంది. దీని ధర రూ.905గా ఉంది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.6 తగ్గి రూ.1,811.50గా ఉంది. అమరావతిలో 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర స్థిరంగా ఉంది. దీని ధర రూ.877.50గా ఉంది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.6 తగ్గి రూ.1,748.50గా ఉంది.

సంబంధిత పోస్ట్