రీల్ పిచ్చి.. తాగే నీళ్లలో ఈత కొట్టారు

97చూసినవారు
రీల్ పిచ్చి.. తాగే నీళ్లలో ఈత కొట్టారు
రీల్స్ కోసం కొందరు యువకులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రజలు తాగే నీళ్లలో కొందరు యువకులు ఈత కొట్టిన వీడియో SMలో వైరల్ అవుతోంది. UPలోని ఉమర్‌‌పూర్ అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాగు నీళ్లందించే ట్యాంకులోకి దిగి ఇద్దరు యువకులు ఈత కొడుతుండగా ఓ వ్యక్తి వారిని వీడియో తీసి SMలో పోస్ట్ చేశారు. వీరిపై నెటిజన్లు మండిపడుతున్నారు. 200ft ఎత్తు ఉన్న ట్యాంకును ప్రమాదకరంగా ఎక్కడమే కాకుండా తాగునీటిలో ఈత కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్