రీల్స్ పిచ్చి.. నదిలో పడిపోయిన ఐఫోన్ (వీడియో)

15552చూసినవారు
స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు రీల్స్ చేయడం మామూలు అయిపోయింది. లైకుల కోసం నానా అవస్థలు పడి మరీ ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నారు. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ యువతి నది ఒడ్డున రీల్స్ చేస్తూ ఉంది. అకస్మాత్తుగా రూ.లక్ష విలువ చేసే ఐఫోన్ నీటిలో పడిపోయింది. అయినప్పటికీ దాన్ని గుర్తించకుండా రీల్ మైకంలో పడింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.