రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో పెంపుడు జంతువుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (JMC) ఈ ఆదేశాలు జారీచేసింది. ప్రతి పెంపుడు కుక్క, పిల్లికి సెప్టెంబర్ 30 లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. గడువులోగా రిజిస్టర్ చేసుకోని యజమానులపై రూ.5,000 వరకు జరిమానా విధించబడుతుంది. రేబిస్ రహిత నగరంగా మార్చడం, పెంపుడు జంతువుల సంక్షేమాన్ని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఆగస్టు 2న 'పెట్ కార్నివాల్' నిర్వహించనున్నారు.