గత మూడు రోజులుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలు నేటి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. స్లాట్ బుకింగ్, భూముల కొత్త మార్కెట్ విలువలు, నిషేధిత ఆస్తుల వివరాలను అధికారిక వెబ్‌సైట్, టి-రిజిస్ట్రేషన్ యాప్‌లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అప్‌డేట్ చేసింది. సబ్ రిజిస్ట్రార్ నుంచి కమిషనర్, IG వరకు నెట్‌వర్క్‌ను పటిష్ఠం చేసి, ప్రతి సేవ నేరుగా ఆన్‌లైన్‌లో సులభంగా అందేలా సిస్టమ్స్‌ను నవీకరించింది.