
ఉక్రెయిన్‌పై మరోసారి భీకర దాడులు (వీడియో)
ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు రష్యా డజన్ల కొద్దీ క్షిపణులు, వందలాది డ్రోన్లతో భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. కనీసం 18 మంది మృతి చెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వంద మందికి పైగా గాయపడ్డారు. కీవ్‌లో ఆరు ఆస్పత్రులు, పలు నివాస, వాణిజ్య భవనాలు దెబ్బతిన్నాయి. నీప్రోలో 12 మంది మరణించారు. రష్యా ప్రయోగించిన 73 క్షిపణులు, 656 డ్రోన్లలో ఉక్రెయిన్ 40 క్షిపణులు, 602 డ్రోన్లను అడ్డుకుంది.




