సాదాబైనామాల క్రమబద్ధీకరణ.. ఈ నెల 12 లోపు ఫీజు చెల్లింపునకు ఆదేశాలు

5చూసినవారు
సాదాబైనామాల క్రమబద్ధీకరణ.. ఈ నెల 12 లోపు ఫీజు చెల్లింపునకు ఆదేశాలు
TG: తెల్ల కాగితాలపై జరిగిన భూ కొనుగోళ్లను క్రమబద్ధీకరించే ప్రక్రియ ఊపందుకుంది. విక్రయదారులు అఫిడవిట్ సమర్పించాలన్న నిబంధనను ఎత్తివేయడంతో దరఖాస్తుల పరిష్కారంలో అడ్డంకి తొలగిపోయింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2020లో దాఖలైన 9.52 లక్షల దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంది. గతంలో అఫిడవిట్ నిబంధనల కారణంగా తిరస్కరణకు గురైన దరఖాస్తులను ఇప్పుడు తిరిగి పరిశీలిస్తున్నారు. ఈ నెల 12లోపు రైతులు ఛార్జీలు చెల్లించి, కొనుగోలుదారుల అఫిడవిట్ సమర్పించే ప్రక్రియ పూర్తి చేయాలని రెవెన్యూశాఖ అదనపు కలెక్టర్లను ఆదేశించింది. దీనిపై అదనపు కలెక్టర్లు ఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్