
డిజిటల్ అరెస్ట్ మోసాలపై కేంద్రం కఠిన నిబంధనలు
దేశంలో పెరుగుతున్న 'డిజిటల్ అరెస్ట్' మోసాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేయడంతో, కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలను రూపొందించింది. ఈ నిబంధనల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. బయోమెట్రిక్ సిమ్ వెరిఫికేషన్, అనుమానాస్పద బ్యాంకు ఖాతాల నిలిపివేత వంటి ప్రతిపాదనలను కేంద్రం నివేదికలో పేర్కొంది. సిమ్ కార్డు జారీలో బయోమెట్రిక్ ఐడెంటిటీ వెరిఫికేషన్, మోసపూరిత సిమ్ కార్డులను బ్లాక్ చేయడం, వాట్సప్ వంటి యాప్‌లలో సిమ్ బైండింగ్, అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేయడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి.




