ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవా టికెట్లు విడుదల

20చూసినవారు
ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవా టికెట్లు విడుదల
ఇంద్రకీలాద్రిపై జరగనున్న శరన్నవరాత్రి మహోత్సవాలకు ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం దేవస్థానం ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనానాయక్, స్థానాచార్యులు కలిసి విడుదల చేశారు. అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఖడ్గమాలార్చన, కుంకుమార్చన, చండీయాగం, శ్రీచక్రనవావరణార్చన సేవలను భక్తులు ఇంటి నుంచే పరోక్షంగా వీక్షించవచ్చు. టికెట్లను https://tms.ap.gov.in లేదా 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఒక రోజు టికెట్ రూ.1,500, పది రోజుల ప్యాకేజీ రూ.11,116. పరోక్ష సేవా టికెట్లు కొన్నవారికి ప్రత్యక్ష దర్శనం ఉండదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్