
నేను బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారంలో నిజం లేదు: అమరిందర్ సింగ్
తాను బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారంలో నిజం లేదని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత కెప్టెన్ అమరిందర్ సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తన 60 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీ తన అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని, అంతమాత్రాన పార్టీని వీడబోనని అన్నారు. పంజాబ్ రాజకీయాల్లో తనతో పాటు ఎందరో సహచరులున్నారని, తమ అభిప్రాయాలను, సలహాలను చెప్పడం తమ బాధ్యత అని తెలిపారు. కొందరు పార్టీలోకి వచ్చి ఏడాది కూడా ఉండటం లేదని.. తాను కాంగ్రెస్, బీజేపీలలో ప్రాధాన్యం లేని వ్యక్తిని కాదని పేర్కొన్నారు.




