తల్లిదండ్రులకు ఊరట.. పాఠ్యపుస్తకాల ధరలు తగ్గింపు

9చూసినవారు
తల్లిదండ్రులకు ఊరట.. పాఠ్యపుస్తకాల ధరలు తగ్గింపు
2026-27 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాల ధరలను ప్రభుత్వం 15-20% తగ్గించింది. నాణ్యతలో రాజీ లేకుండా లామినేటెడ్ పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి. గత ఏడాది రూ.1,078 ఉన్న పదో తరగతి పుస్తకాల సెట్ ధర రూ.900కి తగ్గింది. 9వ తరగతి సెట్ రూ.151, 8వ తరగతి రూ.135, 7వ తరగతి రూ.106, 6వ తరగతి రూ.91, 5వ తరగతి రూ.94 చొప్పున తగ్గాయి. ఈ నిర్ణయంతో ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికంగా ఊరట లభించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్