TG: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. గతంలో ఈడీ అటాచ్ చేసిన రూ.50 లక్షల ఉత్తర్వులను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) అప్పిలేట్ ట్రైబ్యునల్ రద్దు చేసింది. ఏసీబీ ఇప్పటికే రూ.50 లక్షలను స్వాధీనం చేసుకుని ట్రయల్ కోర్టులో భద్రపరిచిందని, అదే మొత్తాన్ని ఈడీ అటాచ్ చేయాల్సిన అవసరం లేదని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ కేసు 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డిపై నమోదైంది.