వీధి కుక్కల తరలింపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

14868చూసినవారు
వీధి కుక్కల తరలింపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థలు, బస్‌, రైల్వేస్టేషన్లు, క్రీడా సముదాయాలు, బహిరంగ ప్రదేశాల సమీపం నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని, వాటిని ఆయా ప్రాంగణాల్లోకి వెళ్లకుండా కంచెలు వేయాలని కోర్టు స్పష్టంచేసింది. కుక్కల తరలింపునకు 8 వారాల సమయం ఇచ్చింది. జాతీయ రహదారులపై తిరుగుతున్న పశువులను కూడా షెల్టర్లకు తరలించాలని సూచించింది. తదుపరి విచారణ జనవరి 13కు వాయిదా పడింది.

సంబంధిత పోస్ట్