
పేకాట గొడవ.. నాటు తుపాకీతో కాల్చి చంపిన స్నేహితుడు
AP: చిత్తూరు రూరల్ మండలంలోని తుమ్మిందపాల్యంలో పేకాట ఆడుతున్న సమయంలో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రూ.2 లక్షల బాకీ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఢిల్లీ బాబు (26) అనే వ్యక్తి, సాయికుమార్ (24) అనే తన స్నేహితుడిని నాటు తుపాకీతో కాల్చి చంపినట్లు సమాచారం. మృతుడు, నిందితుడు ఇద్దరూ అదే గ్రామానికి చెందినవారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.




