
ఇండిగో సంక్షోభం.. 10 రోజుల్లో సర్వీసులు పునరుద్ధరణ!
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పైలట్ల కొరతతో వెయ్యికిపైగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండిగో సంస్థ కీలక ప్రకటన చేసింది. మరో 10 రోజు అన్ని సర్వీసులను సాధారణ స్థితికి తీసుకువస్తామని వెల్లడించింది. ప్రస్తుతం రోజుకు 1,650 సర్వీసులు నడుస్తున్నాయని, డిసెంబర్ 10 నాటికి కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపింది.




