సన్యాసంపై రేణు దేశాయ్ స్పందన: 65 ఏళ్ల తర్వాతే ఆ ఆలోచన

33చూసినవారు
నటి రేణు దేశాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారిని స్థిరపరిచే బాధ్యత తనపై ఉందని రేణు దేశాయ్ అన్నారు. ప్రస్తుతం తన ప్రపంచం పిల్లలేనని, ఆ తర్వాతే దేవుడని ఆమె పేర్కొన్నారు. సన్యాసం తీసుకుంటానని సరదాగా చెప్పిన మాటలు పెద్ద వార్తగా మారడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కచ్చితంగా సన్యాసం తీసుకుంటానని, బహుశా 65 ఏళ్ల వయసులో ఆ నిర్ణయం తీసుకుంటానని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :