
పాములను వేటాడి తినే గ్రౌండ్ హార్న్బిల్స్.. మీకు తెలుసా? (వీడియో)
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవులలో పాములు ఒకటి. అయితే, ఆఫ్రికాకు చెందిన గ్రౌండ్ హార్న్‌బిల్ అనే పక్షి పాములకు భయపడకుండా వేటాడి చంపి తినగలదు. ముఖ్యంగా, అత్యంత విషపూరితమైన పఫ్ అడెర్స్ పాములను కూడా ఈ పక్షులు సులభంగా చంపేస్తాయి. అయితే తాజాగా, ఈ పక్షులకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. @AmazingSights అనే X (ట్విట్టర్) ఖాతాలో షేర్ అయిన ఈ వీడియోను చాలా మంది వీక్షించారు. లైక్ చేసి, కామెంట్లు చేస్తున్నారు.




