రెపో రేటు తగ్గింపు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రభావం ఉంటుందా?

11513చూసినవారు
రెపో రేటు తగ్గింపు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రభావం ఉంటుందా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 0.25% తగ్గించడంతో బ్యాంకులు లోన్లు తీసుకున్న కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది, తద్వారా EMIల భారం తగ్గుతుంది. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) వడ్డీరేట్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో రెపో రేటు తగ్గినప్పుడు చాలా బ్యాంకులు FD రేట్లను తగ్గించాయి. ఈసారి కూడా కొత్తగా FD చేసేవారికి మెచ్యూరిటీ సమయంలో అందే మొత్తం తగ్గే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్