
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు మంగళవారం భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,150 పెరిగి రూ.1,04,800కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,260 పెరిగి రూ.1,14,330 పలుకుతోంది. కేజీ వెండి ధరపై రూ.1,000 పెరగడంతో రూ.1,49,000 వద్ద ధర కొనసాగుతోంది. గత 5 రోజుల్లో కేజీ వెండిపై రూ.8,000 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.




