స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు 50% కేటాయింపు

8627చూసినవారు
స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు 50% కేటాయింపు
TG: మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఖరారు చేశారు. వివిధ పార్టీల రాజకీయ నాయకుల సమక్షంలో కలెక్టర్లు మండలాల వారీగా జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో ఖరారు చేసి ప్రకటించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్​కర్నూల్, జోగులాంబగద్వాల, వనపర్తి జిల్లాల్లోని జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 142 ఎంపీటీసీ స్థానాలకు, 255 సర్పంచ్ స్థానాలకు కూడా రిజర్వేషన్లు కేటాయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్