
నాలుగేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. పరారీలో నిందితుడు
TG: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామంలో నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించిన సంఘటన కలకలం రేపింది. సెల్ఫోన్ చూపిస్తానని ఆశ చూపించి బి. నరేందర్ అలియాస్ నాని (40) అనే వ్యక్తి చిన్నారిని ఇంట్లోకి పిలిచి ఈ దారుణానికి ఒడిగట్టాడు. గురువారం రాత్రి తీవ్ర నొప్పితో బాధపడిన చిన్నారి మరుసటి రోజు తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడు.




