ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ మార్పుపై UIDAI పరిమితులు!

8746చూసినవారు
ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ మార్పుపై UIDAI పరిమితులు!
ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ ఖాతాలు వంటి అనేక అవసరాలకు ఆధార్ కార్డు తప్పనిసరి. UIDAI ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నప్పటికీ, కొన్ని పరిమితులు విధించింది. జీవితంలో కేవలం రెండుసార్లు మాత్రమే ఇంటి పేరును మార్చుకునే అవకాశాన్ని UIDAI కల్పించింది. మహిళలు పెళ్లి తర్వాత పేరు మార్చుకోవడం తప్పనిసరి కాదు. పుట్టిన తేదీని జీవితంలో ఒక్కసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది. లింగాన్ని కూడా ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు. మొబైల్ నంబర్, చిరునామాను ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చని తెలిపింది.

సంబంధిత పోస్ట్