భోపాల్‌లో రిటైర్డ్ IAS రాకేష్ అగర్వాల్‌ దారుణ హత్య

0చూసినవారు
భోపాల్‌లో రిటైర్డ్ IAS రాకేష్ అగర్వాల్‌ దారుణ హత్య
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బుధవారం దారుణ ఘటన వెలుగు చూసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాకేష్ అగర్వాల్‌ను దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు రెండు రోజుల క్రితమే పనిలో చేరిన పనిమనిషిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్