హిందూ దేవుళ్లను రేవంత్ అవమానించారు: బండి సంజయ్

0చూసినవారు
హిందూ దేవుళ్లను రేవంత్ అవమానించారు: బండి సంజయ్
TG: హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా సీఎం వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. కాంగ్రెస్ నరనరాల్లో హిందూ ద్వేషం నింపుకుందని అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ హిందూ దేవుళ్లను అవమానించారంటూ ఆయన ట్వీట్ చేశారు. 'కాంగ్రెస్ MIMకి మోకరిల్లింది. తమది ముస్లింల పార్టీ అని రేవంత్ కూడా అన్నారు. BRS కూడా హిందువులను కించపరిచింది. హిందువులు ఇలా అవమానాన్ని భరిస్తూనే ఉంటారా లేదా ఒక్కటవుతారా' అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్