అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్: హరీశ్ రావు

17చూసినవారు
అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్: హరీశ్ రావు
TG: సీఎం రేవంత్‌పై మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. 'ఈరోజు రేవంత్ రెడ్డి తన నోటి నుంచి టిఎంసీల కొద్దీ అబద్దాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అనుముల రేవంత్ రెడ్డి. నటనకు ఇచ్చినట్లు అబద్దాలకు కూడా ఆస్కార్ గనుక ఇస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్తకంఠంతో రేవంత్ రెడ్డినే ఎంపిక చేస్తారు. ఇవాళ సీఎంకు బచావత్ ట్రిబ్యునల్‌కు, బ్రిజేష్ ట్రిబ్యునల్ కు తేడా తెలియదని వెల్లడైంది' అని Xలో ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్