TG: కాంగ్రెస్‌లో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటనలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పరకాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాలని సీఎం పిలుపునివ్వడం, ఆ తర్వాత ముందస్తు అభ్యర్థుల ప్రకటన చెల్లదని మహేష్ గౌడ్ చెప్పడం పార్టీలో కలకలం రేపింది. తాజాగా, నిజామాబాద్ జిల్లా నుంచి పోటీ చేస్తానని మహేష్ గౌడ్ ప్రకటించడంతో జిల్లా నాయకుల్లో అలజడి నెలకొంది. సొంత నియోజకవర్గం లేని మహేష్ గౌడ్ ఎవరి సీటును ఆశిస్తున్నారనే దానిపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.