రేవంత్ రెడ్డి ఎల్‌నినో కంటే డేంజర్‌: హరీష్​రావు (వీడియో)

5698చూసినవారు
TG: సీఎం రేవంత్ రెడ్డి ఎల్‌నినో కంటే డేంజర్‌గా మారారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, రైతులు కరెంట్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఉచిత కరెంట్ ఇవ్వడానికి ఇష్టం లేక కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్