TG: పాలమూరు రైతులకు నీరివ్వకుండా, శ్రీశైలం నుంచి వెలిగొండ, పోతిరెడ్డిపాడుకు 100 టీఎంసీల నీటిని తరలిస్తూ రేవంత్ రెడ్డి తన గురువుకు గురుదక్షిణ చెల్లిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ విమర్శించారు. జూరాల కింద రైతులకు ఈ కాలంలో కేవలం 18 టీఎంసీలు మాత్రమే ఇచ్చారని, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలలో 150 టీఎంసీలు ఉన్నా నీటిని విడుదల చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. జూరాల ఆయకట్టు కింద ఒక్క ఎకరం ఎండిపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని
కేటీఆర్ హెచ్చరించారు.