
కార్తీక పౌర్ణమి.. అయోధ్యలో సరయు ఘాట్ వద్ద భక్తుల సందడి
పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని, అయోధ్యలోని సరయు ఘాట్ వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. ఈ పవిత్ర దినాన సరయు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.




