
భర్త సమయం ఇవ్వట్లేదని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
TG: హైదరాబాద్‌లోని మూసాపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన చందనాజ్యోతి (25) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని, తన భర్త వెంకటసాయి యశ్వంత్ తనకి సమయం కేటాయించడం లేదని మనస్తాపంతో శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆగస్టులో వివాహం జరిగిన ఈ దంపతులు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. చందనాజ్యోతి వర్క్‌ఫ్రం హోం చేస్తుండగా, భర్త ఉద్యోగానికి వెళ్తున్నాడు. తరచూ భర్తతో గొడవపడుతున్న ఆమె, చివరికి ఈ దారుణ నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందింది.




