రాహుల్‌గాంధీ మెప్పుకోసమే దేవుళ్లపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి

0చూసినవారు
రాహుల్‌గాంధీ మెప్పుకోసమే దేవుళ్లపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి
TG: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా శివుడు, శ్రీరాముడిని వేరు చేసి సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. హామీలు గురించి అడిగితే కొత్త వివాదాలు తెరపైకి తెస్తున్నారన్నారు. రాహుల్‌గాంధీ మెప్పుకోసమే రేవంత్‌ అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. హిందు దేవుళ్లపై మాట్లాడితే ప్రజల మద్దతు రాదని, హామీలు అమలు చేసి మంచి పాలన అందిస్తేనే ప్రజల సపోర్టు కాంగ్రెస్‌కు వస్తుందన్నారు. మతం, కులం, ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటేనని కిషన్‌రెడ్డి విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్