నా దృష్టిలో అది రైతు వంచన సభ: హరీష్ రావు

4017చూసినవారు
నా దృష్టిలో అది రైతు వంచన సభ: హరీష్ రావు
TG: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహిస్తున్నది ఆశీర్వాద సభ కాదని, అది రైతు వంచన సభ అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులను మోసం చేస్తూనే ఉందన్నారు. సీఎం ప్రవర్తన, మాటలు పాలమూరు జిల్లా పరువు తీసేలా చేశారు. బోనస్ హామీ బోగస్ అయిందని, యూరియా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని, మార్కెట్లలో రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్