రేవంత్ రెడ్డి వ్యూహం: బీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి రివర్స్ స్కెచ్!

3739చూసినవారు
రేవంత్ రెడ్డి వ్యూహం: బీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి రివర్స్ స్కెచ్!
TG: బీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి సీఎం రేవంత్ గతంలో ఆ పార్టీ అనుసరించిన వ్యూహాన్నే రివర్స్ లో అమలు చేసే పనిలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిలో భాగంగా, బీఆర్ఎస్ ముఖ్య నాయకుల నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించి, అక్కడి కాంగ్రెస్ క్యాడర్ ను యాక్టివేట్ చేయాలని సీఎం యోచిస్తున్నారు. ఈ నెల 30న కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లకు వెళ్లనున్న సీఎం, అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. వచ్చే నెలలో సిద్దిపేటలో, ఆ తర్వాత గజ్వేల్ లో కూడా సభలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ వ్యూహంతో ప్రత్యర్థి పార్టీ నాయకులను వారి నియోజకవర్గాలకే పరిమితం చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్