
ప్రాణాలు కాపాడే వైద్యుడిపై గూండాల అరాచకం
మధ్యప్రదేశ్లోని సిద్ధిలో ఒక వైద్యుడిపై కొందరు గూండాలు దాడి చేశారు. ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నాడని, పెద్ద నేరం చేసినట్లుగా నడిరోడ్డుపై వైద్యుడిని వేధించారు. ప్రాణాలు కాపాడే వైద్యుడి పట్ల ఇలా ప్రవర్తించడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి గూండాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




