తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. 'మమ్మల్ని వదిలేయండి అని రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకొని మొక్కాలా?' అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన తల్లిని ఇష్టమొచ్చినట్లు తిట్టేవారని, ఢిల్లీలో ఖర్గేతో సమావేశంలో రేవంత్ రెడ్డి తన తల్లిని తిట్టినప్పుడు ఆమె ఎంతో ఏడ్చిందని సురేఖ కుమార్తె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.