TG: సీఎం రేవంత్ అహంభావం వల్లే తెలంగాణకు రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఏకపక్షంగా ఎయిర్‌పోర్టు మెట్రోలైన్‌ను రద్దు చేశారని, అక్రమ కేసులు పెడుతామని L&T సంస్థను బెదిరించారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలు, కమీషన్ల కోసం ఎల్ అండ్ టీ ప్రతిష్టను దిగజార్చి, సంస్థను నాశనం చేయడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. అందుకే ఆ సంస్థ రాష్ట్రం నుంచి వెళ్లిపోతుందన్నారు.