రైతు భరోసా డబ్బులపై రేవంత్ సర్కార్ క్లారిటీ

45చూసినవారు
రైతు భరోసా డబ్బులపై రేవంత్ సర్కార్ క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంక్రాంతి కానుకగా రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. యాసంగి సాగు కోసం ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనుంది. ఈ పథకం కింద దాదాపు కోటిన్నర ఎకరాలకు రూ.9 వేల కోట్లు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూములను గుర్తించి, అర్హులైన రైతులకు సంక్రాంతి పండుగలోపే ఈ నిధులను వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సర్వే పూర్తయ్యే దశలో ఉందని, త్వరలో నిధులు జమ చేస్తామని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్