కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త

23చూసినవారు
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త
TG: రాష్ట్రంలోని వేలాది మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏప్రిల్ నెల నుంచి ఈ ఉద్యోగులందరికీ నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జీతాలు జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వేతనాలు అందుతుంటాయి. దీనివల్ల కమిషన్ల పేరిట కొంత మొత్తం కట్ అవ్వడం, నెలల తరబడి జీతాలు రాక కార్మికులు ఇబ్బందులు పడేవారు. తాజా నిర్ణయంతో మున్సిపాలిటీలు, గురుకులాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య శాఖ , మైనార్టీ సంక్షేమ శాఖల్లో పనిచేసే వేలాది మందికి లబ్ధి చేకూరనుంది.

ట్యాగ్స్ :