
100 డాలర్లకు చేరనున్న చమురు ధర.. భారత్‌పై భారం!
యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. బార్క్లేస్ బ్యాంక్ అంచనా ప్రకారం పరిస్థితులు కొనసాగితే బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరవచ్చు. దీంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.10 వరకు పెరిగే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలతో సరఫరా అంతరాయం కలగవచ్చనే ఆందోళన ఉంది. క్రూడ్ ధర ఒక్క డాలర్ పెరిగినా ఏటా ప్రభుత్వంపై సుమారు రూ.13 వేల కోట్ల అదనపు భారం పడనుంది.




